వార్త ( News ) స్వభావం మారుతోంది. రాను రాను వాస్తవాలకు దూరమవుతోంది. దాని రంగు , రుచి , వాసన కాలానుగుణంగా మారిపోతున్నాయి. అందుకే నేటి పాఠకునికి గాని , వీక్షకునికి గాని కావల్సింది ఏమిటి? అనే ఆలోచన అందరిలో మొదలవుతోంది. చక్కెర పూత పూసిన వార్తలా! సొంత అజెండాలతో రూపు మార్చిన వార్తలా! కేవలం ఆరోపణలు, ప్రత్యారోపణలా! పాక్షిక సత్యాలా! పాఠకునికి ఏవి కావాలి?
రోజూ ఐదారు రూపాయలు ఖర్చు చేసి కొనే దిన పత్రిక గాని , కొన్ని వందలు బిల్లు కడుతూ చూసే 24×7 వార్తా చానల్స్ గాని పాఠకునికి, లేదా వీక్షకునికి పూర్తి సంతృప్తి ని ఇవ్వలేకపోతున్నాయి. అందుకు కారణం వార్తల స్వభావం మారిపోవడమే. ప్రతి వార్త పాఠకునికి అనేక రంగుల్లో కనబడుతోంది. రకరకాల రుచుల్లో కనిపిస్తోంది. కొత్త కొత్త వాసనలతో ఆకట్టుకుంటోంది. కానీ దాని సహజ రూపాన్ని , సహజ లక్షణాన్ని కోల్పోతోంది. అంటే వార్తలు వాస్తవాలను చెప్పడం మానేసి రకరకాల రంగులు పూసుకుంటూ రాజ్యమేలుతున్నాయి.
పాఠకునికి గాని , వీక్షకునికి గాని కావలసింది.. రంగులు పూసుకున్న వార్తలు కాదు.. స్వచ్ఛమైన వాస్తవాలు. ఒకప్పుడు.. అంటే వ్యాపారాత్మక ప్రయోజనాలతో పత్రికలు నడుస్తున్న కాలానికి ముందు ఎలాంటి వార్తలు, విశ్లేషణలు చదివే వారమో అలాంటి వార్తలు, విశ్లేషణలు మళ్లీ రావాలి. అటువంటి మార్పు మళ్లీ తేవడానికే AVV NEWS ఆవిర్భవించింది. ఎన్నో పత్రికలు, ఎన్నో న్యూస్ ఛానెల్స్, మరెన్నో వెబ్ సైట్లు , ఇంకా ఎన్నో యుట్యూబ్ ఛానెల్స్ ఉండగా మరొకటి దేనికి ? అనే ప్రశ్న ఉదయించవచ్చు. దానికి సమాధానమే.. ఈ.. AVV NEWS. వాస్తవ వార్తలను , వాస్తవ విశ్లేషణలను వాస్తవంగా చెప్పడమే ఈ వెబ్ సైట్ లక్ష్యం. చూడండి , పదిమందికి చెప్పండి.. వార్తలనుంచి వాస్తవాలు దూరం కాకుండా చేసే ప్రయత్నంలో భాగస్వాములు కండి…
మీ..
ఎ. వి. వి ప్రసాద్.