మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

0

హైద‌రాబాద్‌: ఈ మ‌ధ్య కాలంలో పెరుగుతూ తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు మళ్ళీ పెరిగాయి. కరోనా మ‌హ‌మ్మారి కేసుల సంఖ్య త‌గ్గూతూ వ‌స్తున్నా కానీ.. ఈ వైర‌స్ ప్ర‌భావం ఇంకా కూడా బంగారం ధరలపై ఉంది అని తెలుస్తుంది. అయితే ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగి రూ.46,800కి చేరింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.450 పెరిగి రూ.51,050కి చేరింది. ఇక నిన్నటి రోజున భారీగా పెరిగిన వెండి ధరలు ఈరోజు కూడా పెరిగాయి. కిలో వెండి ధర రూ.900 పెరిగింది. దీంతో కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో 71,500కి చేరింది.

Leave A Reply

Your email address will not be published.