తెలంగాణాలో కొత్త‌గా 627 కరోనా కేసులు

0

హైద‌రాబాద్‌: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 627 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నలుగురు మృతిచెందారు. ఇదే సమయంలో 721 మంది కరోనాబారినపడి కోలుకున్నారు. ఈ మేర‌కు శ‌నివారం ఉద‌యం వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు సంఖ్య 2,80,822 కు పెరగగా, ఇప్పటి వరకు 1,489 మంది కరోనాతో మృతిచెందారు. 2,72,370 మంది రికవరీ అయ్యారు. ఇక, కరోనా మరణాలు దేశంలో 1.5 శాతంగా ఉంటే రాష్ట్రంలో 0.53 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు దేశంలో 96.99 శాతంగా ఉంటే, రాష్ట్రంలో 95.5 శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6,942 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 4,814 హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 46,694 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా టెస్ట్‌ల సంఖ్య 64,01,082 కు చేరినట్టు ప్రభుత్వం పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.