టాప్ 1లో మ‌హేష్‌.. చివ‌రి స్థానంలో చిరు

0

మ‌రో ప‌దిహేను రోజుల్లో 2020వ సంవ‌త్స‌రానికి శుభం కార్డ్ ప‌డ‌నుంది. ఈ క్ర‌మంలో ట్విట్ట‌ర్ ..సినిమా సెల‌బ్రిటీలు, క్రికెట‌ర్స్, రాజ‌కీయ నాయ‌కులు ఇలా త‌దిత‌ర రంగాల‌కి సంబంధించి ప‌లు స‌ర్వేలు చేస్తూ టాప్ 10 లిస్ట్‌ని ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తుంది. తాజాగా ట్విట్ట‌ర్‌లో సౌత్ సెల‌బ్రిటీల‌లో ఎవ‌‌రి గురించి ఎక్కువ‌ చ‌ర్చ జ‌రిగింద‌నే దానికి సంబంధించి లిస్ట్ ప్ర‌క‌టించారు.

“మీరందరూ ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది..! 2020లో ఎక్కువగా ట్వీట్‌ చేయబడిన దక్షిణ భారత సూపర్‌స్టార్స్‌ వీరే“ అంటూ టాప్‌-10 జాబితాను ట్విటర్‌ ఇండియా షేర్‌ చేసింది.
ఈ జాబితాలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ టాప్‌లో ఉండ‌గా, చివ‌రి స్థానంలో చిరంజీవి ఉన్నారు. ఇక రెండు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మూడు విజ‌య్ ,నాలుగు ఎన్టీఆర్, ఐదవ స్థానంలో సూర్య ఉన్నారు. ఇక హీరోయిన్‌ల విష‌యానికి వ‌స్తే టాప్ వ‌న్ లో కీర్తి సురేష్ ఉంటే టాప్ 10లో త్రిష ఉన్నారు. కాజ‌ల్ రెండో స్థానం ద‌క్కించుకోగా, స‌మంత మూడో స్థానంలోకి వెళ్ల‌డం విశేషం.

 

 

 

Leave A Reply

Your email address will not be published.