హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీపై సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. అన్ని శాఖల కార్యదర్శులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం సమావేశమయ్యారు. రాష్ర్టంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు అన్ని శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలు ఇవ్వాలని కార్యదర్శులను సీఎస్ ఆదేశించారు. ఉద్యోగాల భర్తీ వేగవంతానికి ప్రత్యేకంగా ఓ విభాగం ఏర్పాటు చేయాలని సీఎస్ నిర్ణయించారు. నియామక ప్రక్రియ వేగవంతానికి రిక్రూట్మెంట్ విధానాల్లో సంస్కరణలు తేవాలని సీఎస్ పేర్కొన్నారు.