త‌మిళ‌నాడులో ‘ఓలా’ ఈ-స్కూట‌ర్ ఫ్యాక్ట‌రీ

0

చెన్నై: ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఈ-స్కూట‌ర్ ఫ్యాక్ట‌రీని త‌మిళ‌నాడులో నెల‌కొల్పుతున్న‌ట్లు ఓలా సంస్థ తెలిపింది. ఈ మేర‌కు త‌మిళ‌నాడులో భారీ స్థాయిలో పెట్టుబ‌డులు పెట్టేందుకు నిర్ణ‌యించింది. ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఈ-స్కూట‌ర్ ఫ్యాక్ట‌రీని త‌మిళ‌నాడులో నెల‌కొల్పేందుకు ఆ రాష్ర్ట ప్ర‌భుత్వం ఓలా సంస్థ సోమ‌వారం ఎంవోయూ కుదుర్చుకుంది. సంవ‌త్స‌రానికి 20 ల‌క్ష‌ల యూనిట్ల‌ను ఉత్ప‌త్తి చేసే సామ‌ర్థ్యంతో రూ. 2,400 కోట్ల పెట్టుబ‌డుల‌తో ఈ ఫ్యాక్ట‌రీని ఓలా నెల‌కొల్ప‌నుంది. దీంతో 10 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాలు ల‌భించ‌నున్నాయి. త‌మిళ‌నాడులో ఉత్ప‌త్తి చేసే ఈ-స్కూట‌ర్ల‌ను యూరోపియ‌న్, లాటిన్ అమెరిక‌న్, ఆసియా దేశాల‌కు స‌ర‌ఫ‌రా చేయ‌నున్నారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నెల‌లో ఈ-స్కూట‌ర్‌ను మార్కెట్‌లోకి ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు ఓలా సంస్థ ప్ర‌క‌టించింది.

Leave A Reply

Your email address will not be published.