తెలుసుకుందాం…

0

.భూమిలో ఎక్కడైయితే electronic&magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది.ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు  catalyst గా పని చేస్తాయి.

.ప్రదక్షిణ:-

మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన..ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture  మీద ఆధారపడి వుంటాయి.యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి.

.ఆడవారిని మగవారిని  నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా  గ్రహిస్తాయని….

.కొబ్బరి కాయ స్వచ్ఛతకు గుర్తు.పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును..అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం…

మంత్రాలు:-

ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96..26..అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం..అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర  నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరువస్తాయి.

.గర్భ గుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది.అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు.

అభిషేకం:- విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి..వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి.అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం.

హారతి:-

పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు..హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు.ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు.

తీర్థం:-

ఇందులో పచ్చ కర్పూరం.. తులసి..లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతం తో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు.

తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది..అందుకే మడి..

-ఎవివి ప్ర‌సాద్‌

Leave A Reply

Your email address will not be published.