రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అణ్ణాత్త’. నయనతార, కీర్తీ సురేశ్ కథానాయికలు. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టే లోపే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారట. అయితే ఈ చిత్రం షూటింగ్ కోసం తలైవా ఆదివారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లో దిగారు. ఆయనతోపాటు కథానాయిక నయనతార కూడా మరో విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం నుంచి చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం. ప్రస్తుతం వీరిపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట. మొదట రజనీకాంత్‌పై చిత్రీకరణ చేస్తారని నమాచారం. మీనా, కుష్బూ, ప్రకాశ్‌రాజ్, జాకీష్రాఫ్ కీలక పాత్రధారులు పోషిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్ సంస్థ నిర్మిస్తోంది.