‘సలార్’లో మరో స్టార్‌ హీరో!

0

ప్యాన్ ఇండియా ‌స్టార్‌ ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్‌ నిర్మాణంలో రూపొందనున్న ప్యాన్‌ ఇండియా మూవీ ‘సలార్’. ఈ చిత్రాన్ని ఇటీవలే ప్రకటించారు. రాకింగ్‌ స్టార్ య‌ష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో చేసిన భారీ బడ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్ ప్యాన్‌ ఇండియా మూవీ ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్‌1’ బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు తెరకెక్కుతోన్న ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’ చిత్రంపై భారీ స్థాయిలో క్రేజ్‌ ఉంది.

మరి ఇలాంటి తరుణంలో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో ఆ చిత్రాల దర్శకుడు, నిర్మాణ సంస్థ ‘సలార్‌’ చిత్రాన్ని ప్రకటించడంతో ఒక్కసారిగా ఈ చిత్రంపై భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా క్యాస్ట్ ఉండబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో మరో స్టార్‌ హీరో కూడా చేయబోతున్నాడట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు మోహన్‌ లాల్‌. యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పాత్రకు ధీటుగా మెగాస్టార్ మోహన్‌ లాల్‌ పాత్రని కూడా ప్రశాంత్‌ నీల్‌ డిజైన్‌ చేశాడనే వార్తలు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి. నిజంగా ఈ వార్తలు నిజమైతే.. ఈ సినిమాపై మరింతగా క్రేజ్‌ పెరగడం ఖాయం.

Leave A Reply

Your email address will not be published.