`తలైవి` షూటింగ్‌ పూర్తి.. ఎమోషనల్‌ ట్వీట్ చేసిన కంగనా

0

దివంగత జయలలిత బయోపిక్‌ ‘తలైవి’. బాలీవుడ్ స్టార్‌ కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తోంది. డైరెక్టర్‌ ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వంలో విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌.సింగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ అంతా పూర్తయ్యింది. ఈ విషయాన్ని జయలలిత పాత్రను పోషిస్తున్న కంగనా తెలియజేస్తూ ఓ ఎమోషనల్‌ ట్వీట్‌ చేస్తుంది. “ఇలాంటి పాత్ర యాక్టర్‌కి అరుదుగా దొరుకుతుంది. ఈ పాత్రతో ప్రేమలో పడిపోయాను. విప్లవ నాయకురాలి పాత్ర. సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. డైరెక్టర్‌ విజయ్‌, విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌.సింగ్, విజయేంద్ర ప్రసాద్‌, బృంద ప్ర‌సాద్‌, నీతా లుల్లా, ర‌జ‌త్ స‌రోరా, బ‌ల్లూస‌లూజ‌, జీవీ ప్ర‌కాశ్, అర‌వింద స్వామి వంటి వారితో కలిసి నటించడం జీవితంలో దొరికి అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి యూనిట్‌ను వదిలపోవడం బాధగా ఉంది. మిశ్రమ భావోద్వేగాలతో ఉన్నాను” అన్నారు. మెసేజ్‌తో పాటు జయలలిత విక్టరీ సింబల్‌ ఉన్న ఫొటోను.. తను కూడా జయలలిత లుక్‌లో ఉన్న అదే ఫోజును కంగనా పోస్ట్‌ చేసింది. ఇక పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. తలైవిని వచ్చే ఏడాది జయలలిత జయంతి సందర్భంగా ఫిబ్రవరి 24న విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ పాత్రలో అరవింద స్వామి, మరో తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌, శోభన్‌బాబుగా జిస్సుసేన్‌ గుప్తా నటిస్తున్నారు. జయలలిత స్నేహితురాలు పాత్రలో నటి పూర్ణ నటించారు.

Leave A Reply

Your email address will not be published.