జనవరి 1 నుంచి కొత్త చెక్‌ చెల్లింపుల నిబంధనలు

0

ముంబ‌యి : చెక్కు చెల్లింపుఆ కోసం భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ‘పాజిటివ్ పే సిస్టమ్’ ను ప్రవేశపెట్టింది. దీని కింద రూ.50 వేలకు పైన ఉన్న చెక్కులకు అవసరమైన సమాచారం మళ్లీ నిర్ధారించనున్నారు. చెక్ చెల్లింపుల కోసం ఈ కొత్త నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. చెక్ చెల్లింపులను సురక్షితం చేయడంతోపాటు బ్యాంక్ మోసాలను నిరోధించడానికి ఈ కొత్త నియమాలు రూపొందించారు.

కొత్త నిబంధనల ప్రకారం, చెక్కులను జారీ చేసే వ్యక్తి చెక్ తేదీని ఎలక్ట్రానిక్ పద్ధతిలో గ్రహీత పేరు, చెల్లింపు మొత్తాన్ని తిరిగి తెలియజేయాల్సి ఉంటుంది. చెక్ జారీ చేసే వ్యక్తి ఎస్ఎంఎస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఏటీఎం వంటి ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా ఈ సమాచారాన్ని అందించవచ్చు. చెక్ చెల్లింపునకు ముందు ఈ వివరాలను బ్యాంకు సిబ్బంది క్రాస్ చెక్ చేసుకుంటారు. ఏదైనా లోపం కనబడితే, అది ‘చెక్ ట్రంకేషన్ సిస్టం’ ద్వారా గుర్తించి.. సమాచారాన్ని చెక్ చెల్లింపు చేయవలసిన బ్యాంక్, చెక్‌ జారీ చేసిన బ్యాంకులకు అందుతుంది. రూ.50 వేలు అంతకంటే ఎక్కువ చెల్లింపుల విషయంలో బ్యాంకులు ఖాతాదారులకు ఈ కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. అయితే, ఈ సదుపాయాన్ని పొందాలని ఖాతాదారుడు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.

రూ.5 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువ చేసే చెక్కుల విషయంలో బ్యాంకులు ఈ నిబంధనలను తప్పనిసరి చేయవచ్చు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ వ్యవస్థను అభివృద్ధి చేసి అన్ని బ్యాంకులకు అందుబాటులో తీసుకువచ్చింది. సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, బ్యాంకులు ఖాతాదారుల నుంచి ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా సమాచారాన్ని తీసుకుని రుజువు చేసుకున్న తర్వాతనే చెక్‌లను పాస్‌ చేయాల్సి ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.